బాలీవుడ్ కా రాణీ రాణీముఖర్జీ ఇచ్చిన నయా స్టేట్‌మెంట్ ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ కి దిల్ ఖుష్ చేస్తోంది. సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీ మర్దానీకి సంబంధించి హాట్ అప్‌డేట్ ఇచ్చారు మేడమ్ రాణీముఖర్జీ. బాలీవుడ్‌లో పవర్‌ఫుల్, స్ట్రాంగ్ పాత్రలు చేసే హీరోయిన్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తప్పక అందరూ ప్రస్తావించే పేరు రాణీముఖర్జీ. యాక్టర్‌గా పవర్‌ఫుల్, స్ట్రాంగ్ కేరక్టర్లు చేశారు రాణీ. తన అభిమానుల గుండెల్లో ఎప్పుడూ పదిలంగా దాచుకోదగ్గ సినిమాలు చేశారు రాణీముఖర్జీ. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వెర్సటైల్ ఆర్టిస్టుల్లో రాణీముఖర్జీ ఒకరు.రీసెంట్‌గా విడుదలైన మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే మూవీకి అద్భుతమైన స్పందన వస్తోంది. అందరూ ఈ సందర్భంగా మర్దానిని గుర్తు చేసుకుంటున్నారు. మర్దాని పార్ట్ 1, పార్ట్ 2ని రీ రిలీజ్ చేసినా సూపర్‌గా ఉంటుందని అంటున్నారు. ఈ ఫ్రాంఛైజీలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించారు రాణీముఖర్జీ.
మర్దానికి త్రీక్వెల్ ఉంటుందని ఎప్పటి నుంచో మాటలైతే వినిపిస్తున్నాయి. దీని గురించిరాణీముఖర్జీకి పలు మార్లు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఎప్పటికప్పుడూ ఆ ప్రశ్నను దాటవేస్తూ వచ్చిన రాణీముఖర్జీ రీసెంట్‌గా నోరు విప్పారు. మర్దానికి ఉన్న స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి నాకు బాగా తెలుసు. ఆ కథ అలాంటిది. కథ ఎగ్జయిటింగ్‌గా అనిపించబట్టే నేను చేయగలిగాను. జనాలను మెప్పించగలిగాను. ఇప్పుడు త్రీక్వెల్ విషయంలోనూ నా దృష్టి మొత్తం కథ మీదే ఉంది. కథ బాగోలేకపోతే దాన్ని చేయడం వల్ల ఉపయోగం ఏం ఉంటుంది? ప్రస్తుతానికి మేకర్స్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తే పోలీస్ అవతార్‌లో మళ్లీ అందరినీ పలకరించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అని అన్నారు.